Vizag

[Other] తెలుగు భాషా దినోత్సవం/Telugu Language Day, దేశ భాషలందు తెలుగు లెస్స

2017-08-29 12:41:04
489 29
హాయ్ మి అభిమానులు,           ప్రతిఒక్కరూ సంతోషంగా ఉన్నారనినేను భావిస్తున్నాను.
         తెలుగు భాషా దినోత్సవం, ప్రతి సంవత్సరం ఆగష్టు 29 న భారత గణతంత్ర రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించబడుతుంది. ఈ కవి తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జన్మదినం సందర్భంగా జరిగింది.


ఆధునిక తెలుగు భాషలోకి గ్రాండ్హికను సరళీకృతం చేసిన గొప్ప వ్యక్తి అయిన గిడుగు వెంకట రామమూర్తి.

శ్రీ కృష్ణ దేవరాయలు: తెలుగు భాష మరియు సాహిత్యంలో అతని నైపుణ్యం మరియు ప్రేమ, అతని న్యాయస్థానంలో తెలుగు అధికారులకు ప్రాధాన్యత ఇవ్వబడింది, తెలుగు మాట్లాడే కమాండర్లు మరియు యోధుల యొక్క అధిపతి అతని తల్లి యొక్క ప్రభావానికి చాలా రుణపడ ఉంద


ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతము

గేయం:
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

                                                      
   - శంకరంబాడి సుందరాచారితెలుగు రచయిత లలో శంకరంబాడి సుందరాచారి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు.


క్రెడిట్స్:ఆంధ్ర జ్యోతి వార్తాపత్రిక

నేడు తెలుగు భాషా దినోత్సవంతెలుగుభాష తీయదనం.. తెలుగుభాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం.. ఓ సినీకవి కలం నుంచి జాలువారిన అక్షర సత్యం ఇది. అమ్మా అనే పిలుపుతోనే తెలుగు మాధుర్యాన్ని పంచుతుంది. ఏలికలు మేల్కొని తేనెలొలుకు తేట తెలుగును రక్షించుకోకపోతే కొవ్వొత్తిలా కరిగిపోతోంది. నేడు వ్యవహారిక భాషా ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి. తెలుగుభాష దినోత్సవం వేళ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
తెలుగులో ప్రాచీన కాలంలోనేగాక, ఆధునిక కాలంలో కూడా గొప్ప సాహిత్యం వస్తోంది. పల్లె పదం నుంచి జానపదుల సంస్కృతి సంప్రదాయాలు అలరారుతోంది.
తెలుగు భాష రక్షణ ఇలా..
1. ప్రపంచంలో 6,600 భాషలు ఉంటే.. అందులో తెలుగు ఒకటి.
2. తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పించి నాలుగేళ్లయింది.
3. కుటుంబం నుంచే తెలుగు భాష అమలు కావాలి.
4. తెలుగు రచయితలను ప్రోత్సహించాలి. వారు రాసిన పుస్తకాలను ముద్రించి సమాజానికి అందించాలి.
5. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కార్యాలయాల్లో తెలుగులోనే మాట్లాడాలనే నిబంధనలు రావాలి.
6.తెలుగు ఔన్నత్యాన్ని పాఠ్యగ్రంఽథాల్లో ప్రవేశపట్టాలి.
7. విద్యార్థి దశ నుంచే మాతృభాష పట్ల మమకారం పెంచాలి.
8.తెలుగు కావ్యాలలోని సామాజిక గతాన్ని సమాజానికి చాటి చెప్పాలి.
9.పరభాషను గౌరవించు.. మాతృభాషను ప్రపంచానికే
చాటిచెప్పు అన్న నినాదాన్ని ఇంటింటికి చేర్చాలి.
10.జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, ప్రతి పల్లెల్లోనూ తెలుగు గ్రంథాలయాల్లో ఏర్పాటు చేయాలి.
11.జానపదాలు, జానపద కళాకారులపై విస్తృత ప్రచారం చేయాలి.
12. తెలుగు సాహిత్యంలో పరిశోధనలు కొనసాగాలి.
తెలుగుభాష పరిరక్షణకు కృషి చేయాలి
-కెంగారు మోహన్‌, సాహితీ స్రవంతీ కన్వీనర్‌, ఆదోని
తెలుగు భాష గొప్పతనం ఈనాటిది కాదు. ప్రపంచ దేశాలలో తెలుగు గొప్పతనం ఆనాడే చాటి చెప్పారు. యునెస్కో అంచనా ప్రకారం అంతరించిపోతున్న భాషల జాబితాలో తెలుగు ఉంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మేల్కొని తెలుగును బతికించే విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి.
తెలుగు సాహిత్యాన్ని సమాజానికి అందించాలి -డా.హరికిషన్‌, ప్రముఖ రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు, జడ్పీ హైస్కూల్‌, బదినేహాల్‌, కోసిగి మండలం
తెలుగు భాష దినదినాభివృద్ధి చెందా లంటే సాహిత్యం అత్యుత్తమ స్థాయిలో రాణించాలి. ప్రపంచ భాషలన్నింటిలో తెలుగు భాషకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. తెలుగు కవులను ప్రోత్సహించి, వారు రచించిన పుస్తకాలను ప్రభుత్వమే అచ్చు వేయించాలి.
ప్రైవేటు పాఠశాలల విధానం మారాలి
-డా.బి.ఉమాదేవి, రిటైర్డ్‌ తెలుగు ప్రొఫెసర్‌, ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల
ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే నేరమన్నట్లు శిక్ష విధిస్తున్నారు. ఇది మారాలి. ప్రైవేటు పాఠశాలల్లో సైతం 6వ తరగతి వరకు తెలుగు ఖచ్చితం చేయాలి. పరభాష వ్యామోహంలో నేడు తెలుగును ప్రజలకు దూరం చేస్తున్నారు. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు నడుంబిగించాలి.
ప్రాచీన సాహిత్యం విశిష్టత
ప్రచారం చేయాలి
-జి.ఉరుకుందమ్మ, తెలుగు సాహిత్య పరిశోధకురాలు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి
తెలుగు భాష గొప్పతనాన్ని వర్ణించ డం అక్షరాలకు అందనిది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకు ఎంతో విశిష్టత ఉంది. . అలాంటి తెలుగు ఆంగ్ల భాష మమకారంతో గతి తప్పుతోంది. ఈ భాషను పరిరక్షించుకోకపోతే కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.

                     
తదుపరి కొనసాగుతుంది.....
తర్వాతి థ్రెడ్లో కవులు మరియు గొప్పతనాన్ని గురించి.ధన్యవాదాలు
సంజయ్
Rate

Number of participants 1 Experience +1 Pack Reason

View Rating Log

2017-08-29 12:41:04
Favorites7 RateRate

Bunny Avanzado

Sampathnarasimha | from Redmi Note 4

#1

బాగా  చెప్పారు గుడ్
2017-08-29 13:16:20

Bunny Master

592566428 | from Redmi Note 4

#2

ధన్యవాదాలు
2017-08-29 13:38:07

Bunny Semi-pro

1649401145 Vijay | from Redmi 3S

#3

ధన్యావాదాలు
2017-08-29 13:45:07

Bunny Avanzado

1634220903 | from Redmi 4A

#4

Mathru bashni marchipovadam chala thappu
2017-08-29 14:04:16

Bunny Pro

Devarasetti Naveen Kumar | from Redmi Note 4

#5

కంటెంట్ బాగుంది
2017-08-29 17:43:30

Bunny Semi-pro

SAM KHADRI | from Redmi Note 3

#6

vadanam....manchi vaartha rasaru tammudu
2017-08-29 20:45:47

Bunny Master

Prem | from Redmi Note 4

#7

Thanks for the information
2017-08-29 20:46:30

Bunny Pro

SanjayRaj1222 Author | from Redmi 4

#8

Prem

Thanks for the information

ధన్యవాదాలు
2017-08-29 23:20:11

Bunny Pro

SanjayRaj1222 Author | from Redmi 4

#9

Prem

Thanks for the information

ధన్యవాదాలు
2017-08-29 23:20:27

Bunny Pro

SanjayRaj1222 Author | from Redmi 4

#10

SAM KHADRI
vadanam....manchi vaartha rasaru tammudu

ధన్యవాదాలు..
2017-08-29 23:20:52
please sign in to reply.
Sign In Sign Up
  • Followers

    3

  • Threads

    28

  • Replies

    954

  • Points

3 дня подряд
7 дней подряд
21 день подряд
40 дней подряд
70 дней подряд
June-100 replies in a month
more power more life
Aug-100 replies in a month
Sep-100 replies in a month
1st Anniversary
2 million registered members
Newbie Member
Diwali

Mi Comm APP

Stay updated on Mi Products and MIUI

Copyright
Content Policty
Quick Reply To Top Return to the list